గాంధీ జయంతి సందర్భంగా మొక్క నాటిన కురుమ వెంకటేశ్వర్లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గాంధీ జయంతిని పురస్కరించుకుని శిల్ప ఎంక్లేవ్ కాలనీ పార్కులో కుటుంబ సభ్యులతో కలిసి కురుమ వెంకటేశ్వర్లు మామిడి మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వృక్షో రక్షతి రక్షతః అనే సందేశంతో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ వెంకటేశ్వర్లు, ఆయన సతీమణి కురుమ ఉమాదేవి, సిరిగది శ్రీనివాస్, సిరిగది ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here