తెలంగాణ రక్షణ సేనలో భారీ చేరికలు

శేరిలింగంప‌ల్లి, జూలై 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతానికి ఊతమిచ్చేలా పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమకారుడు షేక్ అస్లాం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 25 మంది తెలంగాణ రక్షణ సేనలో చేరగా, పార్టీ నాయకుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీకి ప్రజలు అండగా నిలిచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య బండారి, విష్ణు చారి, సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మహేష్, ప్రదీప్, రాజశేఖర్, రాజు, వజీర్, కుమార్, శ్రీనివాస్, రాజ్, సతీష్, రంగా, షేక్ వలి, హగంరాజు, బాల, తేజ, జిలాని, మురళి, రాకేష్, సలాం, మధు, వర్మ, సంతోష్ తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here