ఏసీపీ కిరణ్‌కుమార్‌ను స్వర్ణకార సంఘం నేతల శుభాకాంక్ష‌లు

శేరిలింంగ‌ప‌ల్లి, జూన్ 9 (న‌మ‌స్తే శేరిలింంగ‌ప‌ల్లి): విశ్వకర్మ వ‌ర్గానికి చెందిన ప్రముఖ అధికారి ఏసీపీ కె.ఎం. కిరణ్‌కుమార్‌ను శేరిలింగంపల్లి స్వర్ణకార సంఘం నాయకులు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఏసీపీ కిరణ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, సామాజిక సేవా కార్యక్రమాలు, విశ్వకర్మ వర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి స్వర్ణకార సంఘం అధ్య‌క్షుడు మారోజు ప్ర‌భుచారి, నాయకులు అంబిడి రఘు చారి, సిరిపురం హరికృష్ణ చారి, చింతోజు శోభనాచారి, మహంకాళి శివకుమార్ చారి, కరిమెళ్ల సూర్య నాగాచారి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here