టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీవీ9 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రఘురాం రెడ్డి, తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల అని అన్నారు. ఆ కలను సాకారం చేసుకునే కొనుగోలుదారులకు ఒకే వేదికపై వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను పారదర్శకంగా, వినూత్నంగా పరిచయం చేయడంలో టీవీ9 నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో అభినందనీయమని పేర్కొన్నారు. గృహ కొనుగోలుదారులకు సరైన ఎంపికలు చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here