శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా అర్బన్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూషా మహేష్ యాదవ్‌కు హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఘన సన్మానం నిర్వహించారు. హుడా కాలనీలో జరిగిన కార్యక్రమంలో బోయిని అనుషా మహేష్ యాదవ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు ఘన సన్మానం నిర్వహించిన హఫీజ్‌పేట్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మహిళా సాధికారత, ప్రజాసేవ, పార్టీ బలోపేతం కోసం మరింత బాధ్యతతో, నిబద్ధతతో, అంకితభావంతో నిరంతరం పనిచేస్తానని బోయిని అనుషా మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ కురుమ, మాజీ డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ రాజు, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, పాలెం శీను, దేవేందర్, నర్సింగ్ యాదవ్, రామ్ రెడ్డి, కౌశిక్, రమణారెడ్డి, అమరేందర్ రెడ్డి, వెంకట్ ముదిరాజ్, సురేష్ యాదవ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.





