శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానికులతో కలిసి పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించిన హమీద్ పటేల్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అవుట్‌లెట్‌ను అత్యవసరంగా పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే గాంధీ సహకారంతో కొండాపూర్ డివిజన్‌లో స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్ కాలనీలోని డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొక్క వీరబ్రహ్మం, కొప్పు కృష్ణయ్య, అందేపల్లి నాగమణి, నర్సింగరావు, జయరాములు, బాబాయ్, కన్నయ్య, మున్నీ, జయమ్మ, ఇందిర, బీవీ లక్ష్మి, గౌరమ్మ, అక్బర్, సత్తిరెడ్డి, సందీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.





