శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు అడ్డంకులు లేని ఫుట్పాత్లు, రహదారులు, ప్రజా ప్రదేశాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న వాక్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఆక్రమణల తొలగింపు డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్లో 14 గుర్తించిన ప్రాంతాల్లో మొత్తం 18.8 కిలోమీటర్ల మేర తనిఖీలు నిర్వహించి 347 ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా సీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ వాక్ ఫ్రీ కార్యక్రమం ద్వారా పాదచారులకు సురక్షితమైన, ఆక్రమణలులేని ఫుట్పాత్లు, ప్రజా ప్రదేశాలు అందుబాటులోకి తీసుకురావడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే ఆక్రమణలను తొలగించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. పునరావృతమయ్యే ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






