శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, మయూరి నగర్ కాలనీల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి, సంతకం చేసి బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు తిరిగి అందజేయాలని సూచించారు. ఫారం తీసుకోవడం మాత్రమే సరిపోదని, సంతకం చేసి తిరిగి సమర్పించినప్పుడే ఓటు నమోదు ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత BLOలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు, నాయకులు చంద్రికా ప్రసాద్ గౌడ్, కిషోర్, వెంకటేష్ గౌడ్, ఉమ, తిమ్మరాజు, సాంబయ్య, శివ, నరేష్, రాజ్యలక్ష్మి, జ్యోతి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






