కొండాపూర్‌లో ఓటరు నమోదు ఫారాల పంపిణీ.. భారీగా పాల్గొన్న కాలనీవాసులు

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని పోలీస్ క్యాంప్–8 బెటాలియన్ ఫంక్షన్ హాల్‌లో ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తు ఫారాల పంపిణీ, స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్షా నగర్ కాలనీ, కొత్తగూడ గ్రామం, ఆనంద్‌నగర్, ఊట్ల సత్తయ్య కాలనీ, శ్రీనివాస్ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. కాలనీవాసులు ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను తీసుకుని వాటిని పూర్తి చేసి సంబంధిత అధికారులకు అందజేశారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, సవరణలకు సంబంధించిన ప్రక్రియను అధికారులు వివరించి అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రక్త జంగం గౌడ్ పాల్గొని ప్రజలను ఓటరు నమోదు ప్రక్రియలో చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు కూడా ఉత్సాహంగా స్పందించి తమ దరఖాస్తులను సమర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here