శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్లో ఎన్యుమరేషన్ సర్వే పనులను మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. జూన్ 24 నుంచి విధుల్లో ఉన్న బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తారానగర్, ఆదర్శ్ నగర్, బాపునగర్తో పాటు పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన BLOలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) నిర్వహిస్తున్న సర్వే పురోగతిని సమీక్షించారు. ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు సభ్యురాలు కవిత, దేవులపల్లి శ్రీకాంత్, గోపినగర్ అంబేద్కర్ భవన్ జనచైతన్య అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, సుధాకర్ రెడ్డి, రవీందర్, మహేష్ చారీ, నటరాజ్, సయ్యద్ మీర్ అలీ, అహ్మద్, మహేందర్ సింగ్, సత్యనారాయణ, తుకారామ్తో పాటు పలువురు BLOలు, BLAలు పాల్గొన్నారు.






