హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ సిటీగా మార్చే సత్తా కేవలం సీఎం కేసీఆర్ కే ఉందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని భాను టౌన్షిప్లో కాలనీవాసులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల తెరాస అభ్యర్థులు పూజిత, జగదీశ్వర్ గౌడ్లతో కలిసి ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో తెరాసకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం తెరాసదేనన్నారు. ప్రజలు తెరాస అభ్యర్థులకు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అన్వర్ షరీఫ్, మహ్మద్ షరీఫ్, భీమ్ రావు, కాజా, మక్బుల్ పాల్గొన్నారు.