గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబాకు ఓటు వేసి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని మంజీరా డైమండ్, రాంకీ, అపర్ణ సైబర్ జోన్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. నగరాన్ని విశ్వనగరంగా మార్చే సత్తా ఆయనకే ఉందన్నారు. కనుక ప్రజలు తెరాస అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సత్యనారాయణ, సురేందర్, రామారావు, విజయ్, విజయ, నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
