- ఇలియాజ్ షరీఫ్‌కు మద్దతుగా ప్రచారం
మియపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్ నగర్, జేపీ నగర్, హెచ్ఎంటీ, మక్తా మహబూబ్ పేట్, రెడ్డి కాలనీ, బీకే ఎన్ క్లేవ్, మయూరి నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, న్యూ కాలనీ, ప్రగతి ఎన్ క్లేవ్, లక్ష్మీ నగర్, అమన్ కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీ ప్రాంతాల్లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇలియాజ్ షరీఫ్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ యువ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరేంద్ర గౌడ్, శ్రవణ్ కుమార్, తిరుపతి, కృష్న, మన్నె సురేష్, మధుసూదన్ గౌడ్, సాయిగౌడ్, నరేందర్ ముదిరాజ్, శేఖర్, డి.రాజు, విజయ్, నరసింహ రాజు, తౌసిఫ్, రమేష్, ఆసిఫ్, జాకీర్, వెంకటేష్, పవన్, వజీద్, అఖిల్, జావేద్, మోసిన్ పాల్గొన్నారు.