సీఎం కేసీఆర్ స‌భ‌కు త‌ర‌లిన శేరిలింగంప‌ల్లి తెరాస శ్రేణులు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో న‌గ‌రంలోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వ‌హించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌కు శేరిలింగంపల్లి డివిజన్ నుంచి డివిజ‌న్ తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు భారీగా త‌ర‌లివెళ్లాయి. ఈ సంద‌ర్భంగా న‌గ‌రానికి వెళ్లే వాహ‌నాల‌ను ఎన్నికల ఇంచార్జి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గులాబీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మొత్తం 40 బస్సుల్లో 20 వాహనాల్లో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలివెళ్లారు.

శేరిలింగంప‌ల్లి డివిజన్‌లో జెండా ఊపి వాహ‌నాల‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్

పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ల ఆధ్వ‌ర్యంలో…
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో న‌గ‌రంలోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వ‌హించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌కు హ‌ఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజ‌న్ల తెరాస అభ్య‌ర్థులు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌ల ఆధ్వ‌ర్యంలో డివిజ‌న్ల నుంచి భారీ ఎత్తున తెరాస శ్రేణులు స‌భకు త‌ర‌లివెళ్లాయి. ఈ సందర్భంగా వాహ‌నాలను జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్ లు టీఆర్ఎస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.

హ‌ఫీజ్‌పేటలో వాహ‌నాల‌ను తెరాస జెండా ఊపి ప్రారంభిస్తున్న జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here