శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కుటుంబ సభ్యులు శనివారం విస్తృత ప్రచారం చేపట్టారు. రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి గాంధీ సతీమణి శ్యామలాదేవి, కుమారుడు పృథ్వి గాంధీ, కోడలు డాక్టర్ భార్గవి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.