జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం : ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

హైద‌ర్‌న‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో తెరాస విజ‌య దుందుభి మోగిస్తుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శ‌నివారం హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని నాగార్జున హోమ్స్, గౌతమి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో నిర్వ‌హించిన ఆత్మీయ సమావేశంలో డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి నార్నె శ్రీ‌నివాస్‌తో క‌లిసి గాంధీ పాల్గొన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, చిత్రంలో నార్నె శ్రీ‌నివాస్

ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. డిసెంబర్ 1న జరగబోయే ఎన్నికలలో హైదర్ నగర్ డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నార్నె శ్రీనివాస రావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌న్నారు. హైదర్ నగర్ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. హైదర్ నగర్ లో ప్రతి సమస్య ను పరిష్కరించామని తెలిపారు. మియపూర్ మెట్రో స్టేషన్ నుండి మిత్ర హిల్స్ వరకు సమాంతర రోడ్డులు నిర్మించామ‌న్నారు. అంబిర్ చెరువు, కిందికుంట, అలీతలాబ్ చెరువులను సుందరీకరించామని అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పటు చేస్తామని, పార్కులను నిర్మిస్తామ‌ని అన్నారు. ప్ర‌జ‌లు తెరాస‌కు ఓటు వేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మురళి, నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here