మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ గురువారం ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లో గడిచిన 6 సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.