శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్‌లో డివిజన్ తెరాస అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక అభిరుచి హోటల్ సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. భారీ సంఖ్యలో తెరాస నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.
తెరాసలో చేరికలు…
శ్రీరాం నగర్ ‘సి’ బ్లాక్ లో 100 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రవికిరణ్ ఆధ్వర్యంలో గురువారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి యువనేత రాగం అనిరుధ్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జలనిధి రజక సేవ సంఘం అధ్యక్షుడు టి.జగదీష్, ఎ.పెద్దిరాజు, నాభి, సల్మాన్, మనోజ్, రాజేష్ పాల్గొన్నారు.