మియాపూర్ లో బీజేపీ విస్తృత ప్ర‌చారం

మియాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని మ‌క్తా, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, వెస్ట్ సిటీ, కృషినగర్ లలో డివిజ‌న్ బిజెపి అభ్యర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెరాస ప్ర‌భుత్వం గ‌త 5 ఏళ్లలో గ్రేట‌ర్‌లో ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌ని అన్నారు. తెరాస నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోపించారు. కేవ‌లం బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తేనే న‌గ‌రం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఓట‌ర్లు క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేసి త‌మ‌ను గెలిపించాల‌ని కోరారు.

క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న కర్లపూడి రాఘవేంద్ర రావు
క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న కర్లపూడి రాఘవేంద్ర రావు

మియాపూర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు సతీమణి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మేనిఫెస్టోను ప్రజలకు అందించి కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్ధించారు. అలాగే మియాపూర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు కుమార్తె సౌజన్య పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు.

బీజేపీకి ఓటు వేయాల‌ని కోరుతున్న కర్లపూడి రాఘవేంద్ర రావు సతీమణి లక్ష్మి
క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న కర్లపూడి రాఘవేంద్ర రావు కుమార్తె సౌజన్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here