గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రాంగూడలో డివిజన్ బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ నాయకుడు రవికుమార్ యాదవ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రేటర్ మేయర్ పీఠం బీజేపీదేనన్నారు. గత 5 ఏళ్లలో తెరాస ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైందన్నారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని డివిజన్లు అభివృద్ది చెందుతాయన్నారు. డిసెంబర్ 1న కమలం పువ్వుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీన్ లాల్ సింగ్, నీలం నరేందర్ ముదిరాజ్, కిషోర్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.







