హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారం, సుభాష్ నగర్ బస్తీలో ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన జరగనున్న గ్రేటర్ ఎన్నికల లో ప్రజలందరూ కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లలో కళ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

