చెరువుల అభివృద్ధితో జ‌ల‌క‌ళ‌: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో ఉన్న కుడికుంట చెరువును Sahe NGO కల్పన రమేష్ ఆధ్వ‌ర్యంలో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ సౌజన్యంతో చేపడుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులలో భాగంగా చెరువును PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. చెరువుల సుందరీకరణతో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని తెలిపారు. చెరువుల జలకళ తో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి , జీవ వైవిధ్యం పెరుగుతుంది, పక్షులు వలసలు మొదల‌వుతాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, రాములు, మల్లేష్, పవన్, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here