శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో డివిజన్ టీఆర్ఎస్ యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్ ఆధ్వర్యంలో తెరాస కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లింగంపల్లి గ్రామ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లింగంపల్లి గ్రామంలో కార్పొరేటర్ గా చేసిన అభివృద్ధిని రాగం నాగేందర్ యాదవ్ వివరించారు. ప్రచారంలో శేరిలింగంపల్లి డివిజన్ తెరాస ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, లింగంపల్లి గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్, అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, యశ్వంత్ రాజ్ యాదవ్, హజీమ్, అస్లమ్, గఫర్, పవన్, నిజాం, సలీమ్, కిట్టు, శ్రీకాంత్ యాదవ్, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


