చందానగర్ లో ఉదృతంగా సాగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార కార్యక్రమం చందానగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీని నాయకులు ఉదృతంగా సాగిస్తున్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ, సురక్ష ఎన్క్లేవ్, భవానీపురం, ఫ్రెండ్స్ కాలనీ, సత్య ఎనక్లేవ్ తదితర ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థి అక్సారిబేగం కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు.

ఎన్నికల ప్రచారంలో ఓటు అభ్యర్థిస్తున్న అక్సారిబేగం, సీనియర్ నాయకులు నిజామొద్దీన్

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించడం తో పాటు వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న ఇండ్ల యజమానులకు 5 లక్షల నష్ట పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చి పేదలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటికీ ఉచితంగా నీటి కనెక్షన్ అందించడం తో పాటు ప్రతీ నెలా 30 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.

ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చందానగర్ కాంగ్రెస్ శ్రేణులు

చందానగర్ డివిజన్ లో ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటువేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.డి.నిజాముద్దీన్, రఘునందన్ రెడ్డి, రాజా పటేల్, రాజన్, పాషా, షబానా ఖాజా, జావేద్ హుస్సేన్, నందు, ప్రవీణ్, అమిత్ అగర్వాల్, గణేష్ ముదిరాజ్, రాజేష్ నాయక్, నందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here