గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించాలి: వెంగని నర్సింగ్ ముదిరాజ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో 26 జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన విషయాల‌ను చర్చించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంగని నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో అన్ని డివిజన్లో గణతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ చేయాలని, అలాగే దినోత్సవ జండాలు ఎగురవేయాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శంకరుల సురేష్ ముదిరాజ్ మాట్లాడుతూ 26 జనవరి నాడు గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని, అనంతరం అన్ని డివిజన్ల‌లో మరుసటి రోజు పార్టీ జెండా ఆవిష్కరణ కూడా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకి, డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ వనం పద్మ శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, శేరిలింగంపల్లి యువజన నాయకులు శ్రీనివాస్, రజిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here