శేరిలింగంపల్లి జోన్ లో ఓటరు ప్రతిజ్ఞ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి జోన్ లో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వ‌హించారు. భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాధాన్యాన్ని నిలబెట్టాలని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఇతర ఏవైనా ఒత్తిడులకు ప్రభావితం కాకుండా, ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.. అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here