మియాపూర్ డివిజ‌న్‌లో తెరాస అభ్య‌ర్థి ఉప్ప‌లపాటి శ్రీ‌కాంత్ పాద‌యాత్ర

మియాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ల‌క్ష్మీ న‌గ‌ర్‌, అర‌బిందో కాల‌నీల్లో డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ బుధ‌వారం ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం, పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెరాస హ‌యాంలోనే హైద‌రాబాద్ లో అభివృద్ది ఎక్కువ‌గా జ‌రిగింద‌న్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని డివిజ‌న్ల‌లోనూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల స‌హ‌కారంతో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టార‌న్నారు. కారు గుర్తుకు ఓటు వేసి త‌న‌ను గెలిపించాల‌ని కోరారు.

పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న ఉప్ప‌లపాటి శ్రీ‌కాంత్

ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు బీఎస్ఎన్ కిర‌ణ్ యాద‌వ్‌, వ‌ర‌ల‌క్ష్మి, మోహ‌న్ ముదిరాజ్, అన్వ‌ర్ ష‌రీఫ్‌, మ‌హేంద‌ర్ ముదిరాజ్‌, రాజు, స్వ‌రూప‌, గురువ‌య్య‌, పులి జితు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న ఉప్ప‌లపాటి శ్రీ‌కాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here