ప్ర‌జ‌లు మ‌రోసారి కార్పొరేట‌ర్‌గా గెలిపించాలి: పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని ఇంజినీరింగ్ ఎన్‌క్లేవ్, ఆర్టీసీ కాలనీ, దత్తసాయి ఎన్‌క్లేవ్ కాల‌నీల్లో బుధ‌వారం డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజ‌న్ ప‌రిధిలో గ‌త 5 ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని అన్నారు. ప్ర‌జ‌లు త‌న‌కు మ‌రోసారి కార్పొరేట‌ర్‌గా అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. కార్పొరేట‌ర్ గా మ‌ళ్లీ గెలిపిస్తే డివిజ‌న్‌ను రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చేస్తామ‌న్నారు. కారు గుర్తుకు ఓటు వేసి త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here