చింతకింది మీనమహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన 100 మంది మహిళలు
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ సుజాత నాగేందర్ యాదవ్ అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన టిఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు చింతకింది మీనా మహేందర్ గౌడ్, మాధవి ల ఆధ్వర్యంలో దాదాపు 100 మంది మహిళలు పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ కు మద్దతు తెలుపుతూ టిఆర్ఎస్ పార్టీ లో చేరారు.
పార్టీలో చేరిన మహిళలకు సుజాత నాగేందర్ యాదవ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికలో తమపై విశ్వాసం ఉంచి గెలిపించారని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నెహ్రూనగర్, గోపినగర్, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో తాగునీరు ,రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజి సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు.
మరోసారి టిఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను డివిజన్ ప్రజలందరికీ అందేలా చూస్తానని, డివిజన్ ను మరింత అభువృద్ది పరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు సుజాత, రజిని, సునీత, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.