హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కోనప్ప, టీఎస్‌క్యాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస పార్టీ ఇంచార్జ్ ఆగయ్యలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. హైదర్ నగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిసెంబర్ 1న జరగబోయే ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ప్రజలు స్వచ్ఛందంగా తెరాసలో చేరుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువనేత ఆరెకపూడి పృథ్వీ గాంధీ, తెరాస నాయకులు కోనేరు ప్రసాద్, పోతుల రాజేందర్, అసోసియేషన్ సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.