అక్ర‌మార్కుల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తారా: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ మదీనా గూడ గ్రామంలోని శ్మ‌శానవాటిక వద్ద గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి షెట్టర్స్ నిర్మించి వచ్చిన అద్దెలతో శ్మ‌శానవాటిక, దేవాలయాల నిర్వహణ నిమిత్తం వాడుతుండగా అక్రమ నిర్మాణాలను చేప‌డుతున్నారని కావాలని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని గ్రామస్తులు తెలియజేయగా, తక్షణమే బీజేపీ సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్, ఇతర నాయకులతో కలసి వెళ్లి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ నిర్మించిన షెట్టర్స్ అద్దెకు ఇవ్వగా వచ్చినా ఆదాయంతో శ్మ‌శానవాటిక, గ్రామ పరిధిలోని చిన్న దేవాలయాల నిర్వహణ నిమిత్తం వాడుతున్నారని అన్నారు. ఎవరో ఒకరు స్వలాభం కోసం కావాలని అధికారులకు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారని, అధికారులు కూడా సరైన సమాచారం లేక గ్రామస్తులను ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. త‌మ‌ నాయకులు , కార్యకర్తల‌తో స్వయంగా వచ్చి పరిశీలించామని, కానీ గ్రామంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. ఇదే విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జితేందర్, సురేష్, శ్రీనివాస్ యాదవ్, రమేష్, శివ, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here