మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌ను సంద‌ర్శించిన డీసీపీ రంజ‌న్ ర‌త‌న్ కుమార్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌ను మేడ్చ‌ల్ ట్రాఫిక్ జోన్ డీసీపీ రంజ‌న్ ర‌త‌న్ కుమార్ వార్షిక త‌నిఖీల్లో భాగంగా సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్టేష‌న్‌లోని రికార్డులు, రిజిస్ట‌ర్‌లు, ఇత‌ర ముఖ్య‌మైన ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ప‌నిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు, పోలీస్ స్టేష‌న్ స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేష‌న్‌లో సిబ్బంది ప‌నితీరు సంతృప్తిగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభినందించారు. రికార్డుల నిర్వ‌హ‌ణ‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప్ర‌ద‌ర్శ‌న చక్క‌గా ఉన్నాయ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్‌, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here