శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరా హిల్స్ కాలనీకి చెందిన సీనియర్ నాయకుడు, కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆయన స్వగృహానికి వెళ్లి వెంకట్ నాయక్ ను పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వెంకట్ నాయక్ అనారోగ్యంకు గురవడం బాధాకరం అని, త్వరగా కోలుకోవాలని , అధైర్యపడకూడదు అని, కుటుంబ సభ్యులను యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. త్వరితగతిన కోలుకోవాలని, వెంకట్ నాయక్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు.






