శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి నూతన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గా జి. తిమ్మప్ప బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ముత్తు యాదవ్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌లో డిఐగా విధులు నిర్వహిస్తున్న తిమ్మప్ప కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గా ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ తిమ్మప్ప మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు.






