శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లకు విస్తరిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. అయితే మంగళవారం నాడు సదరు 3 డివిజన్లకు సంబంధించిన హద్దులు, పరిధిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఆలోచనను పరిశీలించి అందులో సూచనలు లేదా అభ్యంతరాలు తెలపడానికి ప్రజలకు వారం రోజులు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిల్లోని డివిజన్ ల పరిస్థితిని పరిశీలిద్దాం.

శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్ల పరిధిలోని డివిజన్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. శేరిలింగంపల్లి సర్కిల్ లో 3 చందానగర్ సర్కిల్లో 4 కలిపి గతంలో 7 డివిజన్లుగా ఉన్న ఈ పరిధి ఇప్పుడు కొత్తగ మరో 11 కలిసి 18 డివిజన్లుగా విస్తరించబడింది. గతంలో గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్ పేట్, మియాపూర్, చందానగర్ డివిజన్లు ఉండగా ఇప్పుడు అదనంగా నల్లగండ్ల, మసీద్ బండా, శ్రీరామ్ నగర్, అంజయ్య నగర్, హైటెక్ సిటీ, ఇజ్జత్ నగర్, మాతృశ్రీ నగర్, మదినగూడ, దీప్తి శ్రీనగర్, బికె ఎంక్లేవ్, మయూరి నగర్ ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడనున్న మొత్తం 18 డివిజన్ల పరిధి హద్దులు కింద మీ కోసం.









