శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ కాలనీలో రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసుల ఆహ్వానం మేరకు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను రేపటి తరానికి తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ప్రభాకర్, రమేష్, ముకేష్, శంకర్, దత్తపాణి, చంద్రమోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, నవీన్ యాదవ్, రాము, హరి పాల్గొన్నారు.






