జీవో నంబ‌ర్ 131ను స‌వ‌రించ‌డం హ‌ర్ష‌ణీయం: ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): రాష్ట్ర మున్సిప‌ల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధ‌వారం అసెంబ్లీలో ఎల్ఆర్ఎస్‌పై చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ స్వాగ‌తించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల్ఆర్ఎస్‌పై విడుదల చేసిన జీవో నంబర్ 131కు గాను ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు గతంలో రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూనే పరిగణలోకి తీసుకునే విధంగా జీవోను సవరణ చేసి మళ్లీ పునఃప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.

ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

పేద, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల సంక్షేమం దృష్ట్యా 131వ జీవోను సవరించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ప్రభుత్వానికి ఖజానా కాకుండా పేద ప్రజల శ్రేయస్సే ముఖ్యమని ప్రభుత్వం భావించి జీవోను సవరణ చేయడం గొప్ప పరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞ‌తలు తెలియజేస్తునని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞ‌తలు తెలుపుతున్నామ‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here