ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలిగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ లోని తులసి నగర్ కాలనీలో ఆరవ రోజు బస్తీ బాట కార్యక్రమాన్ని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు ఓపెన్ నాలా పనులు, డ్రైనేజీ పనులు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయనకు తెలిపారు. కాలనీ ప్రారంభంలో వేసిన డ్రైనేజీ లైన్లతో ఇబ్బంది పడుతున్నారని అధికారులకు ప్రతిపాదనలు పంపామని త్వరలో డ్రైనేజీ విస్తరిస్తామని ఓపెన్ నాలా పనులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఈసందర్బంగా ఆయన కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు కుమారి, వర్క్ ఇన్‌స్పెక్టర్ శివ, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు చంద్రశేఖరరెడ్డి, గోపి చారి, ఎస్ ఆర్ రమేష్, క్రిస్టోఫర్, సీహెచ్ శ్రీనివాస్, సతీష్ కుమార్, అనిల్ రెడ్డి, డి.జి.రాజు, హరినాథ్ రెడ్డి, వి.రాజు, సుకుమార్, హనుమంతరావు, శ్రీనివాస్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.