శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న H-CITI ప్రాజెక్ట్స్ పనులు, SNDP విభాగంలో జరుగుతున్న నాలాల విస్తరణ పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డీసీ ప్రశాంతి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, H-CITI ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు, SNDP విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రూ.1606 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి రూ. 1606 కోట్లనిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామి నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగం పెంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు , రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు రఘునాథ్ రెడ్డి, ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు EE నామ్యా, DE హరీష్ బాబు, SNDP విభాగం అధికారులు EE శ్రీనాథ్ రెడ్డి, DE ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.






