శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): హరిహరసుతుడు అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. తెల్లాపూర్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కిషోర్ ముదిరాజ్ ఆహ్వానం మేరకు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో లింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్ తో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.






