మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మియాపూర్ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కర్లపూడి రాఘవేంద్ర రావు సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. తెరాస పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో తెరాస వైఫల్యం చెందిందన్నారు. గ్రేటర్‌లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాఘవేంద్ర రావు కుమార్తె సౌజన్య బిజెపి మహిళా కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీని గెలిపించాలని కోరారు.








