మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్‌క్లేవ్, రెడ్డి కాలనీ, ప్రజయ్ షెల్టర్స్, సాయి జ్యోతి కాలనీలలో డివిజన్ తెరాస అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు ఓటు వేసి కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, అన్వర్ షరీఫ్, చంద్రిక ప్రసాద్ గౌడ్, కాసాని శ్రీధర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్ పాల్గొన్నారు.







