మాదాపూర్ డివిజ‌న్‌లో బీజేపీ ముమ్మ‌ర ప్ర‌చారం

మాదాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మాదాపూర్‌లో బీజేపీ ముమ్మ‌రంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారంలో వేగం పెంచారు. సోమ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల‌లో డివిజ‌న్ బీజేపీ అభ్య‌ర్థి గంగల రాధాకృష్ణ యాదవ్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హారిక, వేణుగోపాల్, రంజిత్, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి, జగన్, అంకిరెడ్డి పాల్గొన్నారు. అలాగే డివిజ‌న్ ప‌రిధిలోని మాతృశ్రీనగర్ మహిళలు పెద్ద ఎత్తున బీజేపీ అండగా నిలిచారు. ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓటు వేస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.

మ‌హిళ‌ల‌తో మాట్లాడుతున్న గంగల రాధాకృష్ణ యాదవ్
బీజేపీకి అండ‌గా నిలిచిన మ‌హిళ‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here