ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారు: బీజేపీ నాయ‌కులు

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో బీజేపీలో చేరుతున్నార‌ని ఆ పార్టీకి చెందిన ప‌లువురు నాయ‌కులు పేర్కొన్నారు. బుధ‌వారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ సాయి నగర్ కాలనీ వాసి లక్ష్మణ్ గౌడ్, ఆయ‌న బృందం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వ‌ర్యంలో బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర నాయకులు యోగానంద్, జ్ఞానేంద్ర ప్రసాద్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొవ్వా సత్యనారాయణ, నాగులు గౌడ్, జయలక్ష్మిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారికి కండువాలు క‌ప్పుతున్న బీజేపీ నాయకులు

అనంతరం బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందిని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే మోదీకి ప్రజలంతా అండగా ఉన్నారని అన్నారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి, ప్ర‌వేశ‌పెడుతున్న‌ సంక్షేమ పథకాలతో ప్రజలు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారు, పార్టీలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేయాలని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినప్పుడే పార్టీకి గుర్తింపు వస్తుంద‌ని అన్నారు.

పార్టీలో చేరిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో బీజేపీ నాయ‌కులు

ఈ కార్యక్రమంలో కర్ణాటక బీజేపీ నాయకులు శివరాజ్ డాగే, సుధాకర్ సూర్య వంశీ, అనిల్, నాయకులు మనోహర్, కోటేశ్వరరావు, రవి గౌడ్, డివిజన్ బీజేపీ అధ్యక్షులు మాణిక్ రావు, జయరాములు, యువ మోర్చా కన్వీనర్ జితేందర్, నాయకులు వర ప్రసాద్, విష్ణు ప్రియ, వినిత సింగ్, కళ్యాణ్, పవన్, సురేష్, లక్ష్మణ్, రెడ్డి ప్రసాద్, ప్రశాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here