శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో ద‌శ‌ల‌వారీగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం: కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తూ డివిజన్ అభివృద్ధికి పాటుపడుతున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని సందయ్య నగర్, పాపిరెడ్డి కాలనీల్లో ఆయ‌న‌ పర్యటించారు.

శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

సురభి కాలనీ మీదుగా ప్రధాన రహదారి గుండా వేస్తున్న యూజీడీ పైపులైన్ పనులను సందయ్యనగర్ వద్ద కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ పర్యవేక్షించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో‌ యూజీడీ సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు వాపోయారు. పాపిరెడ్డి కాలనీలో దాదాపు యూజీడీ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. కాలనీలో జరుగుతున్న వీడీసీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు.

సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పొడుగు రాంబాబు, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు ఏదుల బసవరాజు, నాయకులు లింగారెడ్డి, ప్రవీణ్, వర్క్ ఇన్ స్పెక్టర్లు యాదగిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here