జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ బి వినోద్ కుమార్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ వారి ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో బిఆర్ఎస్ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ తో కలసి బిఆర్ఎస్ యువ నాయకుడు మారబోయిన రవి యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, రవి యాదవ్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించారు. అనంతరం ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ నేటి యువతకు వారి గుణాత్మతకు అనుగుణంగా విద్యా సదుపాయాలు కల్పించడంలో జీ ఇన్సిటిట్యూట్ తోడ్పడుతుందని అన్నారు. యువతకు విద్యా సదుపాయాలు కల్పించడం మనందరి బాధ్యతని, మీడియా విద్యా రంగానికి ఈ ఇన్సిటిట్యూట్ ఒక మైలు రాయిలా నిలుస్తుందని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here