శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ లోని మసీదుబండ మారుతి నగర్ లో డైరెక్టర్ జి.కుమార స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ZIMA (ZEE Institute of media Arts) స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ZIMA ఆధ్వర్యంలో ప్రేక్షకులను అలరిస్తూనే సమాజానికి చక్కని సందేశం అందించేలా చిత్రాలు, సీరియల్స్‌ను నిర్మించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ZIMA స్టూడియో కుమారస్వామి ఆధ్వర్యంలో కచ్చితంగా ఫాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతుందని అన్నారు. కుమార్ స్వామి కష్టపడి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఈ స్టూడియోలో కళారంగం పై ఆసక్తి కల వారికి సినిమా రంగానికి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ లలో నాణ్యమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అలాగే సినిమాలలో అవకాశం కల్పిస్తారని అన్నారు. ఇందుకు గాను 7780357444 అనే ఫోన్ నంబర్‌లో ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలోగడ్డం శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు కుమార్ యాదవ్, గడ్డం తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.






