శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల నేపథ్యంలో హైదర్‌నగర్ విద్యుత్ శాఖ మంగళవారం (జూన్ 30) రెండు విడతల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వికాస్ సబ్‌స్టేషన్‌కు చెందిన **11 కేవీ కేంద్రీయ విహార్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ అంతరాయం కేంద్రీయ విహార్ అపార్ట్‌మెంట్స్, క్రికెట్ గ్రౌండ్, చిల్డ్రన్స్ పార్క్, బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కేవీ లెజెండ్ ఫీడర్ పరిధిలో నిర్వహణ పనులు చేపట్టనున్నారు. దీంతో లెజెండ్ అపార్ట్‌మెంట్, ఏఆర్‌కే టవర్స్, మయూరి నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. నిర్వహణ పనుల కారణంగా వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసిన హైదర్‌నగర్ ఏఈ (ఆపరేషన్), ప్రజలు సహకరించాలని కోరారు.





