శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ 75 వ పుట్టిన రోజు సందర్భంగా అఖిల్ భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిర కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రపథాన నిలిపిన భారత ప్రధాన నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, అభిషేక్, సుమన్, ఆదేశ్, అభిషేక్, విశాల్, సుభాష్, విమల్ , రాహుల్ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.






