టౌన్ ప్లానింగ్ అధికారుల ప‌క్ష‌పాత ధోర‌ణి.. కొన్ని నిర్మాణాల సీజ్ మాత్ర‌మే ఎందుకు: మిద్దెల మ‌ల్లారెడ్డి

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని టౌన్ ప్లానింగ్ అధికారులు ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మ‌ల్లారెడ్డి ఆరోపించారు. శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని శ్రీ‌రామ్ న‌గ‌ర్ సి బ్లాక్ లో ప్లాట్ నం.944, 266ల‌లో చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశార‌ని, ఇది హర్ష‌ణీయ‌మ‌ని అన్నారు. కానీ ప‌క్క‌నే సి బ్లాక్ లో ఉన్న ప్లాట్ నంబ‌ర్లు 260, 262, 263ల‌లోనూ అక్ర‌మ నిర్మాణాలు కొన‌సాగుతున్నాయ‌ని, వాటిని సీజ్ చేయ‌కుండా ఎందుకు వ‌దిలేశార‌ని ప్ర‌శ్నించారు. అధికారులు, సిబ్బంది కాసుల‌కు క‌క్కుర్తి ప‌డి సీజ్ పేరిట డ్రామాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు. నిజంగా అక్ర‌మ నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే ఇత‌ర భ‌వ‌నాల‌ను కూడా సీజ్ చేయాల‌ని అన్నారు. లేదంటే అధికారులు ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అర్థం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here